రూ. 2 లక్షలు దాటనున్న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర!
రిపోర్టర్: సునీల్
స్థలం: India
యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర భారత్‌లో రూ. 2 లక్షల మార్కును దాటేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అత్యాధునిక 2nm చిప్ టెక్నాలజీ, మెమరీ చిప్‌లు మరియు విడిభాగాల ధరల పెరుగుదల కారణంగా ఈ మోడల్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై యాపిల్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.