మోత్కూర్కు కోర్టు రాకపోవడంపై ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్న తిరుమలేష్

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

మోత్కూర్కు నూతన కోర్టు మంజూరు చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు దాసరి తిరుమలేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాకు ఏడు కొత్త కోర్టులు మంజూరైనా మోత్కూర్కు మొండిచేయి ఎదురుకావడం బాధాకరమన్నారు. మోత్కూర్, అడ్డగూడూరు మండలాల పరిధిలో వెయ్యికి పైగా కేసులు ఉన్నాయని, 50 కిలోమీటర్ల దూరంలోని రామన్నపేటకు వెళ్లలేక కక్షిదారులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా నూతన కోర్టు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు.