ఎన్నికల సామగ్రితో వెళ్లే సిబ్బందికి రోడ్లపై తీవ్ర ఇబ్బందులు

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్ లో ఎన్నికల సామగ్రితో వెళ్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఆటోలను సిబ్బంది తోసుకుంటూ వెళ్లగా, సాలూరులో బస్సు బురదలో కూరుకుపోయింది. తిరుపతి జిల్లాలో బోట్లలో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్ల సరిగా లేకపోవడం వల్ల పోలింగ్ సిబ్బంది నానాపాట్లు పడాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.