పట్టణాల్లో మొక్కల పెంపకం నిధులు గాలికి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విజయనగరం, బొబ్బిలి, రాజాం పట్టణాల్లో పచ్చదనం పెంపు, సుందరీకరణ పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టాయి. మొక్కలు నాటామంటూ కాగితాలపై లెక్కలు చూపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ట్రీగార్డులు, మొక్కలు మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం వృథా అవుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.