జన్నారంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు గట్టి పోలీసు నిఘా
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు.