'కార్గో ఎయిర్పోర్ట్ మాకొద్దు..': కళ్లకు గంతలతో రైతుల నిరసన

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు వినూత్న రీతిలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని ప్రభావిత గ్రామాల రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి తమ సారవంతమైన వ్యవసాయ భూములు, జీవనాధారాన్ని కాపాడాలని గళమెత్తారు. ఎయిర్పోర్టు కోసం ఏపీఏడీసీఎల్ దాదాపు 1,647 ఎకరాల భూమిని గుర్తించినట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, భూ సేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.