వైఎస్ వివేకా హత్య కేసుపై వైసీపీ సంచలన ఆరోపణలు: టీడీపీతో సునీతమ్మ భేటీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh

ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలో వివేకా కుమార్తె సునీతమ్మ, ఆమె భర్త చంద్రబాబును కలవడంపై YSR Congress Party తీవ్ర విమర్శలు చేసింది. వివేకా హత్య కేసును త్వరగా పూర్తి చేయమని కోరడానికి కాకుండా, కడప జెడ్పీ ఛైర్మన్ పదవి కోసమే వారు చంద్రబాబును కలిశారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. రాజకీయ లబ్ధి కోసమే ఈ భేటీలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.