ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగిపై వేధింపులు: ఏరియా హెడ్ తీరుపై సర్వత్రా విమర్శలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వింజమూరు

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న లోన్ ఆఫీసర్ను ఏరియా హెడ్ శివకృష్ణ తీవ్రంగా వేధిస్తున్నారు. అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని సెలవులో ఉన్న ఉద్యోగిని విధులకు రావాలని బలవంతం చేస్తున్నారు. ఆఫీస్కు రాకపోతే తప్పుడు కేసులు పెడతానని, ఉద్యోగం లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.