యువ ఆటగాళ్లకు వన్డే జట్టులో చోటు ఇవ్వాలని యువరాజ్ సూచన
రిపోర్టర్: సునీల్
స్థలం: ముంబై
భారత క్రికెట్ జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పించాలని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సెలెక్టర్లకు సూచించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి యువకులను వన్డే జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నారు. యాభై ఓవర్ల ఫార్మాట్ లో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. సీనియర్లు ఉన్నప్పటికీ యువత ప్రదర్శన ఆధారంగా త్వరలోనే అవకాశాలు వస్తాయని యువీ ఆశాభావం వ్యక్తం చేశారు.