జన్నారంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీతో ఘన నివాళులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను విధిగా స్మరించుకోవాలని జన్నారం సీఐ రమణమూర్తి తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పోలీసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ధర్మారం చౌరస్తా నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.