స్మరణీయ విజయం: అంబులెన్స్ పైలట్ సూర్యనారాయణ మూర్తి ఖాతాలో నూట యాభై పతకాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: శృంగవరపుకోట
అత్యవసర వేళల్ లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఖాళీ సమయాల్ లో క్రీడల్ లో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్న ఎం. సూర్యనారాయణ మూర్తి ఇప్పటివరకు నూట యాభై పతకాలను సొంతం చేసుకున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన ఆయన, ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే వెటరన్ అథ్లెటిక్స్ విభాగంలో జాతీయ మరియు రాష్ట్రస్థాయి పోటీల్ లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.