రోడ్డుపై బోల్తా పడిన లారీ ఎగబడిన జనం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మొరాదాబాద్
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో డాల్డా ఘీతో వెళ్తున్న లారీ రోడ్డుపై బోల్తా పడింది. రామ్‌గంగా వంతెన వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో డ్రైవర్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న వన్‌స్పతి ఘీ రోడ్డు అంతటా పారింది. దీంతో స్థానికులు బకెట్లు, డబ్బాలతో ఘీని ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ సిటీ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు.