ట్రావిస్ కెల్స్ మోసం కేసులో సిద్దార్థ్ జవహర్ వివాహానికి బ్రేక్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
ప్రముఖ అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు ట్రావిస్ కెల్స్‌ను మోసం చేసిన కేసులో నిందితుడైన సిద్దార్థ్ జవహర్ వివాహ ప్రయత్నాలకు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అడ్డుకట్ట వేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన సిద్దార్థ్ జవహర్‌కు ఇప్పటికే కోర్టు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఇమ్మిగ్రేషన్ హోదా కోసమే అతను వివాహం చేసుకుంటున్నాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.