గర్భాశయ క్యాన్సర్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అవగాహన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భారతదేశం

కేంద్ర ప్రభుత్వ స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ అభిమాన సంఘాలు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. 820 పాఠశాలల్లో సుమారు మూడు లక్షల మంది బాలికలు, యువతులకు హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.