జైలర్ 2లో మోహన్ లాల్ డూప్ వివాదంపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

జైలర్ 2 చిత్రంలో మోహన్ లాల్ స్క్రీన్ టైమ్ తగ్గడం, క్లైమాక్స్ కారు సీన్లో బాడీ డబుల్ వాడారనే ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది. క్లైమాక్స్లో డూప్ను వాడలేదని, స్వయంగా మోహన్ లాల్ నటించారని జైలర్ 2 యాక్షన్ డైరెక్టర్ స్పష్టం చేసినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. మోహన్ లాల్ బాడీ డబుల్ జోబీ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో ఈ వివాదం చెలరేగినట్లు ఆయన వివరించారు.