అమంగల్ మున్సిపాలిటీలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో కలిసి పరిశీలన జరిపిన చైర్మన్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అమంగల్

రంగారెడ్డి జిల్లా అమంగల్ మున్సిపాలిటీ పరిధిలోని సురసముద్రం చెరువు దగ్గర వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు పరిశీలన నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్మన్ మీపత్య నాయక్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గీత ఆచారి కలిసి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముక్తాల వెంకటయ్య, ఎనుమల రమేష్, ఎర్రవోలు మహేష్, అనూష శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్, ధోని, శివ తదితరులు పాల్గొన్నారు.