తిరుమలకు చేరుకున్న వివిధ రాష్ట్రాల శ్రీవారి సేవాకులు: సౌకర్యాలపై వివరణ

రిపోర్టర్: గోపి స్థలం: Tirumala

దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీవారి సేవాకులు తిరుమలకు చేరుకున్నారని టీటీడీ వెల్లడించింది. శ్రీవారి సేవకు ముందుగా పేర్లు నమోదు చేసుకున్న భక్తులు ఇక్కడికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వారికి గ్రూప్ సూపర్వైజర్లు అవసరమైన లాంఛనాలను పూర్తి చేయిస్తారని పేర్కొన్నారు. వసతి సదుపాయాలు, సేవా విధులు, ఇతర మౌలిక వసతుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.