ఎర్రవల్లి భూముల సర్వే వివాదం: కేసీఆర్ కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశం

రిపోర్టర్: రమేష్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325 అసైన్డ్ భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు అమరవీరుల కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సరిహద్దులో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి రెవెన్యూ రికార్డులతో నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. అయితే ఒకే భూమిలో రైతులకు పంపిణీ, అమరవీరుల కాలనీ నిర్మాణం ఎలా సాధ్యమంటూ స్థానిక రైతుల నుంచి తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.