ఏలూరు కళాశాల ల్యాబ్లో కనువిందు చేస్తున్న అరుదైన శిలాజాలు

రిపోర్టర్: గోపి స్థలం: Eluru

ఏలూరులోని సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల భూగర్భశాస్త్ర విభాగం ప్రయోగశాలలో ప్రాచీన శిలాజాలు, అరుదైన శిలలు కనువిందు చేస్తున్నాయి. పురాతన కాలం నాటి డైనోసర్ గుడ్డు, సముద్ర జీవి అమ్మోనైట్ శిలాజాలతో పాటు పగడాలు, క్వార్ట్జ్ క్రిస్టల్స్, దేశంలోని పలు ప్రాంతాల్లో లభ్యమైన అరుదైన శిలల నమూనాలను ఇక్కడ సమకూర్చారు. వివిధ రకాల రాళ్ల సహజ ఆకృతులను భద్రపరిచామని ప్రిన్సిపల్ రత్నాకర్ తెలిపారు. 1977లో ఈ ప్రయోగశాలను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.