జైలర్ 2 హిందీ వెర్షన్ విడుదలపై ఉత్తరాది మల్టీప్లెక్స్లలో తీవ్ర వివాదం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం జైలర్ 2 హిందీ వెర్షన్ ప్రదర్శనపై ఉత్తరాదిలో వివాదం తలెత్తిందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. సినిమా థియేట్రికల్ విడుదలకు ఓటీటీ స్ట్రీమింగ్కు మధ్య ఉండాల్సిన సమయంపై నెలకొన్న విభేదాల కారణంగా ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లు పీవీఆర్-ఐనాక్స్, సినీపోలిస్లలో ఈ చిత్ర హిందీ వెర్షన్ ప్రదర్శనలు రద్దయ్యాయని సమాచారం.