రాచపల్లిలో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తించిన బాలాజీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని సి.ఎం. రాచపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీకుల బాలాజీ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ప్రచారం చేపట్టారు. గ్రామ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని, ప్రజలు తమని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు.