ఎన్టీఆర్ జిల్లాలో నిషేధాజ్ఞలు: పది రోజులపాటు 144 సెక్షన్ అమలు
రిపోర్టర్: అశోక్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామని, బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమికూడరాదని ఆయన హెచ్చరించారు.