రైలు ప్రయాణ థీమ్‌తో ముంబయిలో ఆకట్టుకుంటున్న వినాయక మండపం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబయి
ముంబయిలోని మలాడ్ తూర్పు ప్రాంతంలో శివకృపా మిత్ర మండల్ ఏర్పాటు చేసిన వినూత్న వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రైలు బోగీ ఆకృతిలో తీర్చిదిద్దిన ఈ మండపంలో శివపార్వతులతో కూడిన బాల గణేశ్ కుటుంబం ప్రయాణిస్తున్నట్టుగా విగ్రహాలను అమర్చారు. మూషికాలు ప్రయాణికుల వలె సరదాగా ఆడుకోవడం, పేపర్ చదవడం వంటి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.