రైతన్నలకు సిరులు కురిపిస్తున్న పోక సాగు: ఎకరానికి రెండున్నర లక్షల నికరాదాయం

రిపోర్టర్: సునీల్ స్థలం: తూర్పు గోదావరి

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వక్క సాగు రైతులకు భారీ లాభాలు తెచ్చిపెడుతోందని వక్కరైతు పితాని భీముడు తెలిపారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా లేదా ఏక పంటగా సాగు చేస్తున్న ఈ పోక పంట ద్వారా ఎకరానికి అన్ని ఖర్చులు పోను రెండున్నర లక్షల రూపాయల నికరాదాయం వస్తోందని ఆయన పేర్కొన్నారు. పండు వక్కకు క్వింటా ధర నలభై వేలకు పైగా పలుకుతుండటంతో వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు జోరుగా సాగుతున్నాయి.