అసెంబ్లీ ముట్టడిలో అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రాణాలు కాపాడిన పోలీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన సందర్భంగా కరీంనగర్‌కు చెందిన విద్యార్థి నాయకుడు మల్యాల రాకేశ్ అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.