అనంతపురంలో రిగ్గింగ్ కలకలం: బీజేపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అనంతపురం
అనంతపురంలోని హమాలి కాలనీలో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయని పోలీసులు తెలిపారు. ముప్ఫైవ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని బీజేపీ శ్రేణులు తోసివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.