పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన జలాలు: టీజీపీసీబీ కీలక నిర్ణయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం మరియు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేందుకు పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన వ్యర్థజలాలను పునర్వినియోగించుకోవాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టం చేశారు. బేగంపేటలోని హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. తాగునీటియేతర అవసరాల కోసం ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడాలని అధికారులు కోరారు.