గుంటూరులో భారీ వర్షాల ముప్పు: ఐఎండీ అమరావతి రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: మహేష్
స్థలం: గుంటూరు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి (IMD Amaravati - ఆంధ్రప్రదేశ్ వాతావరణం & తుఫాను హెచ్చరికలు) వెల్లడించింది. నవంబర్ మొదటి తేదీ మధ్యాహ్నం నుంచి నవంబర్ రెండవ తేదీ ఉదయం వరకు వాతావరణం హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.