వేలేరుపాడు స్థానిక పోరులో పోటెత్తిన ఓటర్లు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వేలేరుపాడు

వేలేరుపాడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేడు ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం అధికారులు మండలవ్యాప్తంగా 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి మండలంలో మొత్తం 78.28 శాతం పోలింగ్ నమోదైంది.