సీఎం రేవంత్ రెడ్డి భద్రతా వివరాల లీక్: సైబర్ క్రైమ్ కేసు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అత్యంత రహస్య భద్రతా వివరాలను 'తెలుగు స్క్రైబ్' ఎక్స్ ఖాతాలో బహిర్గతం చేయడంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం బ్లడ్ గ్రూప్, సీఎస్ఓ ఫోన్ నంబర్ వంటి సున్నితమైన సమాచారం లీక్ కావడంతో, దీని వెనుక ఉన్న అధికారుల పాత్రపై సీఎస్ఓ కేబీ ఫ్రాంక్లిన్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారు.