నేటేడుచర్ల మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సూర్యాపేట

నేటేడుచర్ల మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులను నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి - మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి దిశగా నూతన కమిటీ ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. ఈ నియామకం ద్వారా స్థానిక వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని నూతన వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తమవుతోంది.