పోలీస్ సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య: ప్రత్యేక పాఠశాలను ప్రకటించిన తెలంగాణ పోలీసులు
రిపోర్టర్: హరి
స్థలం: Telangana
పోలీస్ సిబ్బంది పిల్లలతో పాటు సాధారణ పౌరుల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ముఖ్యమైన లక్ష్యంతో ఈ నూతన పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీ పోలీస్ వెల్లడించారు. ఈ విద్యా సంస్థ ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాటాలతో కూడిన బోధన అందుతుందని అధికారులు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలకు మేలు చేసే ఈ ప్రతిష్టాత్మక నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.