గురువులపై దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

విజయవాడలో స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై వైకాపా నేతల దాడిని మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. పూజించాల్సిన గురువులపై దాడి చేసిన వైకాపా ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి-బ్లేడ్ బ్యాచుల పనిపడతామని హెచ్చరించారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, దాడిలో పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టవద్దని విజయవాడ సీపీని ఆదేశించినట్లు తెలిపారు.