రాజాపేటలో ఈనెల 29న మాదిగ ఆత్మీయుల సమ్మేళనం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఈనెల 29న మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానం, మాదిగ ఆత్మీయుల సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నట్లు ఇంజ మహేష్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతితులు హాజరవుతున్నారని వెల్లడించారు. మండలంలోని మాదిగ ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.