మహిళా కండక్టర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

మణుగూరు డిపోలో మహిళా కండక్టర్ గా పనిచేస్తున్న గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మరణవార్త తనను కలచివేసిందని పేర్కొంటూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగిని కోల్పోవడం బాధాకరమని సీఎం సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా కల్పించారు.