ఢిల్లీ పీజీ భవనం కూలిపోవడంపై సోనూసూద్ తీవ్ర ఆందోళన

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీలో పీజీ భవనం కూలిన ఘటనలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై నటుడు సోనూసూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో విద్యార్థుల సంఖ్యకు, హాస్టల్ వసతులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ భూముల్లో సురక్షితమైన హాస్టళ్లను నిర్మించాలని సోనూసూద్ డిమాండ్ చేశారు.