ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జనగామ కలెక్టర్ ఆదేశం
రిపోర్టర్: సునీల్
స్థలం: జనగామ
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 221 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా భూ సమస్యలు, చెక్ డ్యామ్ ల అక్రమాలపై బాధితులు కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేశారు.