రోలుగుంటలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
ఎంపీటీసీ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఉదయం రోలుగుంట ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.