ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి కరవు: యువతకు ఉద్యోగాల విషయంలో ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

రాబోయే పది పదిహేనేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు నూట ఇరవై కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి రానుండగా, కేవలం నలభై కోట్ల ఉద్యోగాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయని ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా హెచ్చరించారు. కొత్త ఉద్యోగాలకు, ఉపాధి కోసం ఎదురుచూసే యువత సంఖ్యకు మధ్య భారీ అంతరం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారుతుందని, యువత కొత్త నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.