ఏపీ సీఎస్ జి. సాయిప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయన పదవీకాలం 2027 మే 31వ తేదీ వరకు కొనసాగనుంది.