ఎన్నికలకు దూరంగా ఏకగ్రీవ సంప్రదాయం: ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామం
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు గ్రామంలో దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదని గ్రామస్థులు తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ప్రజాప్రతినిధులను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు. రాజకీయ విభేదాలు తగ్గించడంతో పాటు గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓటు వేయకుండానే అందరి ఏకాభిప్రాయంతో పదవులను భర్తీ చేస్తూ ఈ గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును పొందుతోందని అధికారులు పేర్కొన్నారు.