తాపీ కార్మిక సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా సంకరి కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా యెలగం శ్రీనివాస్ విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను 13వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ దొంగల రాజ్‌కుమార్‌ యాదవ్‌ (చింటు), కౌన్సిలర్‌ బడికల రమేష్, తాపీ సంఘం మాజీ ఉపాధ్యక్షులు ఆవుల కొమురయ్య బీఆర్‌ఎస్‌ నాయకులు తాండ్ర రామకృష్ణ, బండారి ప్రవీణ్, బీమరి వెంకటేష్, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం తాపీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.