రూ.2,000 మించిన UPI లావాదేవీలపై ఛార్జీలు పడేనా?

రిపోర్టర్: మహేష్ స్థలం: భారతదేశం

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం రూ.2,000 వరకు UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే ఆ మొత్తానికి మించిన లావాదేవీలపై స్పష్టత ఇవ్వకపోవడంతో భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీరో-MDR విధానంలో మార్పులు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.