భారతీయ జర్దోజీ కళను కాపీ కొట్టిన రాల్ఫ్ లారెన్
రిపోర్టర్: విజయ్
స్థలం: India
అమెరికా ఫ్యాషన్ బ్రాండ్ రాల్ఫ్ లారెన్ స్ప్రింగ్ కలెక్షన్లో భాగంగా ప్రదర్శించిన పింక్ గౌన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్నోకి చెందిన సాంప్రదాయ జర్దోజీ ఎంబ్రాయిడరీని ఉపయోగించి, దాని మూలాలను ఎక్కడా పేర్కొనకపోవడంపై నెటిజన్లు, ఫ్యాషన్ డిజైనర్లు మండిపడుతున్నారు. భారతీయ కళను గుర్తించకుండా కేవలం 'అంబ్రిల్లిష్మెంట్స్' అని పేర్కొనడం పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.