జ్ఞానేశ్ కుమార్ నియామకంపై కేంద్ర ప్రభుత్వం తీరును నిలదీసిన రాహుల్ గాంధీ
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జ్ఞానేశ్ కుమార్ అనే మాజీ ఐఏఎస్ అధికారిని బీజేపీ కోసం వాడుకున్నారని, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి ఆయనను ఎన్నికల సంఘం బాధ్యతల్లో కూర్చోబెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ తనకు బీజేపీ తరఫున పోటీ చేయాలని, మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారంటూ కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ జిజి థాంసన్ చేసిన సంచలన ప్రకటన ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.