అమెరికాలో సెటిల్ అయ్యే వాళ్లకు షాక్: గ్రీన్ కార్డ్ కలలకు ట్రంప్ బ్రేక్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల గ్రీన్ కార్డ్ కలలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాకిచ్చిందని అమెరికా కార్మిక శాఖ స్పష్టం చేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీలకు సంబంధించిన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో హెచ్-వన్ బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెక్కీల శాశ్వత నివాస ప్రక్రియ తీవ్రంగా ఆలస్యం కానుందని నిపుణులు వెల్లడించారు.