రాష్ట్రంలో అక్టోబర్ 9న జరిగే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్న ఎన్ఎంయూ
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో అక్టోబర్ 9న జరగనున్న ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. క్లాస్-3, క్లాస్-6 విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పి. కమాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండీ మౌలానా వెల్లడించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు నేతలు స్పష్టం చేశారు.