తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: పెద్ద శేష వాహన సేవ
రిపోర్టర్: సునీల్
స్థలం: Tirumala
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అంకురార్పణతో వేడుకలు మొదలయ్యాయని, తొలిరోజు పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారని వివరించారు. ఈ ఉత్సవాల్లో వివిధ వాహనాలపై స్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని అధికారులు కోరారు.