ఇంటర్ విద్యార్థి అజయ్ మృతిపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలన్న ఏఐఎస్ఎఫ్
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి అజయ్ మరణంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఘటనకు గల కారణాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.