స్థానిక ఎన్నికల వేళ రెబల్స్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, నామినేషన్లు వేసిన రెబల్ అభ్యర్థులు వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం అదనపు అభ్యర్థులను పోటీలో నిలపవద్దని, అధికారిక అభ్యర్థులకు వెంటనే బీ-ఫారాలు అందజేయాలని ఆయన పేర్కొన్నారు.